Share News

అదానీ లాభాల పంట

ABN , Publish Date - May 23 , 2025 | 04:47 AM

అదానీ గ్రూప్‌ కంపెనీలు మార్చి 31వ తేదీతో ముగిసిన 2025 ఆర్థిక సంవత్సరంలో లాభాల మోత మోగించాయి. గ్రూప్‌ కంపెనీలన్నింటి స్థూల లాభం రూ.90,000 కోట్లకు చేరింది. 21 నెలల పాటు రుణాలు...

అదానీ లాభాల పంట

రూ.90,000 కోట్లకు చేరిన స్థూల లాభం

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ కంపెనీలు మార్చి 31వ తేదీతో ముగిసిన 2025 ఆర్థిక సంవత్సరంలో లాభాల మోత మోగించాయి. గ్రూప్‌ కంపెనీలన్నింటి స్థూల లాభం రూ.90,000 కోట్లకు చేరింది. 21 నెలల పాటు రుణాలు చెల్లించేందుకు అవసరమైన నగదు నిల్వ జమ అయింది. ఆరేళ్లలో గ్రూప్‌ స్థూల లాభాలు మూడింతలు పెరిగి రూ.24,870 కోట్ల నుంచి (2018-19) రూ.89,806 కోట్లకు (2024-25) చేరినట్టు కంపెనీ ప్రకటించింది. 2024 ఆర్థిక సంవత్సరంతో ఆర్జించిన రూ.82,976 కోట్లతో పోల్చితే లాభం 8.2ు పెరిగింది. ఆరేళ్ల కాలంలో (2019-2025) 24ు సమీకృత వార్షిక వృద్ధి (సీఏజీఆర్‌) నమోదయింది. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రూప్‌ కంపెనీలు రూ.40,565 కోట్ల నికర లాభం ఆర్జించాయి. నికర లాభం ఆరేళ్ల సీఏజీఆర్‌ 48.5ు ఉంది. ఇదే కాలంలో కంపెనీ స్థూల ఆస్తులు 25ు సీఏజీఆర్‌తో రూ.6,09.133 లక్షల కోట్లకు చేరాయి. స్థూల రుణాలు 2024 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రూ.2.41 లక్షల కోట్ల నుంచి రూ.2.9 లక్షల కోట్లకు చేరాయి. రూ.53,843 కోట్ల నగదు నిల్వను కూడా పరిగణనలోకి తీసుకుంటే గ్రూప్‌ కంపెనీల నికర రుణభారం రూ.2.36 లక్షల కోట్లుగా నమోదయింది.

ఆస్తులపై రాబడులు (ఆర్‌ఓఏ) 16.5 శాతంగా ఉన్నాయి. ప్రపంచంలో మౌలిక వసతుల రంగంలోని కంపెనీల్లో గరిష్ఠ ఆర్‌ఓఏ ఇదేనని గ్రూప్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రాబీ సింగ్‌ తెలిపారు. లాభాల్లో అద్భుత వృద్ధి కారణంగా స్థూల లాభాల్లో రుణాల వాటా 2019 నాటి 3.8ు నుంచి 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 2.6 శాతానికి తగ్గింది. స్థూల లాభాల్లో 82ు మౌలిక వసతుల విభాగం నుంచే వచ్చినట్టు ఆయన చెప్పారు. అదానీ గ్రూప్‌ మౌలిక వసతుల విభాగంలో యుటిలిటీ కంపెనీలు అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పవర్‌, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌; రవాణా కంపెనీలు అదానీ పోర్ట్ప్‌, సెజ్‌,


అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఉన్నాయి. పన్ను చెల్లింపుల అనంతర నగదు నిల్వ 13.6ు వృద్ధితో రూ.66,527 కోట్లున్నదని, భారీ నగదు ప్రవాహం కారణంగా రికార్డు స్థాయిలో రూ.1.26 లక్షల కోట్ల ఆస్తులు జోడయ్యాయని రాబీ సింగ్‌ తెలిపారు. అదానీ పోర్ట్‌ఫోలియోలో ఇంత భారీగా ఆస్తులు జోడు కావడం ఇదే ప్రథమమని పేర్కొంటూ దీని వల్ల మొత్తం ఆస్తుల విలువ రూ.6.1 లక్షల కోట్లకు చేరినట్టు ఆయన వెల్లడించారు. ఈ మొత్తంలో నాలుగింట మూడు వంతుల ఆస్తులు గల ఆరేళ్ల కాలంలోనే జోడయ్యాయన్నారు.


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 23 , 2025 | 04:47 AM