హైదరాబాద్, చెన్నైల్లో రెండు కొత్త ప్లాంట్లు
ABN , Publish Date - Mar 11 , 2025 | 02:00 AM
ఆశీర్వాద్ పైప్స్‌లో వంద శాతం వాటా కలిగిన బెల్జియంకు చెందిన ఫ్లూయిడ్ మేనేజ్‌మెంట్ సంస్థ అలియాక్సిస్ వచ్చే రెండేళ్లలో భారత్‌లో కార్యకలాపాలను విస్తరించనున్నట్లు...

ఆశీర్వాద్ పైప్స్
కోల్‌కతా: ఆశీర్వాద్ పైప్స్‌లో వంద శాతం వాటా కలిగిన బెల్జియంకు చెందిన ఫ్లూయిడ్ మేనేజ్‌మెంట్ సంస్థ అలియాక్సిస్ వచ్చే రెండేళ్లలో భారత్‌లో కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్, చెన్నైల్లో రెండు కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఆశీర్వాద్ పైప్స్ సీఈఓ పార్థ సారథి బసు ఈ విషయం వెల్లడించారు. ఈ రెండు కొత్త ప్లాంట్ల ఏర్పాటు కోసం కంపెనీ వచ్చే రెండేళ్లలో రూ.400 కోట్లు ఖర్చు చేయనుంది. కొత్త ప్లాంట్ల ఏర్పాటుతో కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 3 లక్షల టన్నుల నుంచి 4 లక్షల టన్నులకు, మార్కెట్ వాటా ప్రస్తుత 12 శాతం నుంచి 18 శాతానికి పెరుగుతుందని బసు చెప్పారు. దేశ పైపులు, ఫిట్టింగ్స్ మార్కెట్లో అద్భుత అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. ఈ కొత్త ప్లాంట్లతో పాటు కటక్, దుర్గాపూర్‌ల్లోని రెండు ప్లాంట్ల ఉత్పత్తి సామర్ధ్యాలను విస్తరించబోతున్నట్లు బసు చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..