కల్తీగాళ్లను వెనకేసుకొస్తున్న వైసీపీ: పంచుమర్తి
ABN , Publish Date - Nov 12 , 2025 | 06:01 AM
జగన్‌పై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయని, 16 నెలలు జైలు శిక్ష అనుభవించి 16 ఏళ్లుగా బెయిల్‌పై తిరుగుతున్నారని శాసనమండలి చీఫ్...
అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): జగన్‌పై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయని, 16 నెలలు జైలు శిక్ష అనుభవించి 16 ఏళ్లుగా బెయిల్‌పై తిరుగుతున్నారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల నమ్మకంపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించిందని ఆరోపించారు. వేంకటేశ్వరస్వామిపై ఏమాత్రం నమ్మకం లేని వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి తదితరులను టీటీడీ చైర్మన్లుగా నియమించి, తిరుమలను అపవిత్రం చేశారన్నారు.