Share News

వెంకన్నకు వైసీపీ ముఠా ద్రోహం: బుచ్చిరాం ప్రసాద్‌

ABN , Publish Date - Dec 28 , 2025 | 04:45 AM

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా వైసీపీ ముఠా తప్పుడు ప్రచారం చేస్తోంది.

వెంకన్నకు వైసీపీ ముఠా ద్రోహం: బుచ్చిరాం ప్రసాద్‌

అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా వైసీపీ ముఠా తప్పుడు ప్రచారం చేస్తోంది. వైసీపీ తిరుమల వెంకన్నకు తీరని ద్రోహం చేస్తోంది’ అని బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుచ్చిరాంప్రసాద్‌ ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘భక్తుల ముసుగులో వైసీపీ ముఠాలు తిరుమలలో అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి నుంచి తలనీలాల వరకు ప్రతి పనిలో అక్రమాలకు, అవినీతికి పాల్పడిన వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా తిరుమల వెంకన్నను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారాలు చేస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Dec 28 , 2025 | 04:46 AM