Fake Propaganda: వైసీపీ సోషల్ మీడియా బరితెగింపు
ABN , Publish Date - Dec 29 , 2025 | 04:10 AM
కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం విధానంలో విమర్శలకు అవకాశం లేకపోవడంతో వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలకు తెరదీసింది.
నెల్లూరులో వృద్ధుడిని ట్రాప్ చేసి బెల్టు షాపు డ్రామా
కఠిన చర్యలకు పోలీసుల సమాయత్తం
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం విధానంలో విమర్శలకు అవకాశం లేకపోవడంతో వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలకు తెరదీసింది. మరింత బరితెగించి.. నెల్లూరు జిల్లాలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని ప్రచారం చేసేందుకు ఒక అమాయక వృద్ధుడిని ట్రాప్ చేశారు. ఆయనతో బెల్టు షాపు డ్రామా ఆడించారు. అధికారికంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణం నుంచి 5 మద్యం బాటిళ్లు కొనుగోలు చేయించి.. వాటితో బెల్టు షాపు డ్రామా ఆడించి, దాన్ని షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. తన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో సదరు వృద్ధుడు వాస్తవమేమిటో వెల్లడించారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా జరుగుతున్న ఇలాంటి దుష్ప్రచారం పట్ల కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో.. వృద్ధుడితో బెల్టు షాపు డ్రామా ఆడించిన వారిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.