Minister Gottipati: ప్రతిదాన్నీ రాద్ధాంతం చేయడం వైసీపీకి అలవాటే
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:43 AM
ప్రతి చిన్న విషయాన్నీ రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు....
విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రతి చిన్న విషయాన్నీ రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. దుర్గగుడిలో 15 నిమిషాలపాటు విద్యుత్తు అంతరాయం కలిగితే దాన్నీ రాజకీయం చేయడం సిగ్గుచేటని పేర్కొన్ననరు. విద్యుత్తు అంతరాయం విషయం తన దృష్టికి రాగానే యుద్ధప్రాతిపదికన విద్యుత్తు సరఫరా పునరుద్ధరించామని, అధికారుల నడుమ సమన్వయలోపం వల్లే విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు.