Mithun Reddy: మద్యం స్కామ్ కేసు నిలబడదు
ABN , Publish Date - May 22 , 2025 | 06:05 AM
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రభుత్వ తీరును ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ పాలన నిర్వహిస్తున్నారని విమర్శించారు. మద్యం స్కామ్ ఆరోపణలు కుదిరినట్టే కాదు, రేషన్ వాహనాల రద్దు సరికాదన్నారు, హంద్రీనీవా లైనింగ్ పనులపై పునరాలోచన చేయాలని సూచించారు.
అనంతపురం క్రైం, మే 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ తీరును ప్రశ్నించేవారు లేకుండా, ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురి చేసి పాలన సాగించాలని చూస్తున్నారని, ఇది శాశ్వతం కాదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన మీడియాతో మాటాడుతూ వైసీపీ హయాంలో మద్యం స్కామ్ అంటున్నారని, ఒక్క రూపాయి కూడా సీజ్ చేయలేదని, టీడీపీ నేతలు నోటిమాటలతో అంత పెద్ద కేసు అల్లారని ఆరోపించారు. ఇవన్నీ నిలబడేవి కావని అన్నారు. రేషన్ వాహనాల రద్దు సరికాదన్నారు. హంద్రీనీవా లైనింగ్ పనుల గురించి ప్రభుత్వం పునరాలోచన చేయాలని మిథున్‌రెడ్డి కోరారు.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి