YSRCP leader SV Mohan Reddy: అంతా లేడీస్... లేడీస్ అంటారు..!
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:33 AM
చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌పై కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి వెటకారంగా స్పందించారు. వైసీపీ నేతలు ఆదోని వైద్య కళాశాల పరిశీలనకు వెళ్లారు...
మగాళ్లకు వంటలు నేర్చుకోవడానికిశిక్షణ తరగతులు పెట్టండి
వాళ్లు అసెంబ్లీకి పోతే.. మేం వంటైనా చేస్తాం
మహిళా బిల్లుపై వైసీపీ నేత ఎస్వీ వెటకారం
ఆదోని రూరల్/కర్నూలు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌పై కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి వెటకారంగా స్పందించారు. వైసీపీ నేతలు ఆదోని వైద్య కళాశాల పరిశీలనకు వెళ్లారు. ఆ సందర్భంగా మహిళా బిల్లుపై ఎస్వీ మాట్లాడుతూ, ‘రేపు ఎమ్మెల్యే ఎన్నికల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు వస్తే ఎవరుఎగురుతారో..? ఎవరుంటారో..! అంతా లేడీస్... లేడీస్ అంటున్నారు. మాకు ఒక పని చేయండి. వంట నేర్చుకోవడానికి మగవాళ్లకు ట్రైనింగ్ క్లాసులు పెట్టండి. వంటైనా నేర్చుకుంటాం. వాళ్లు(మహిళలు) అసెంబ్లీకి పోతే, మేము వంటైనా చేసుకుంటాం’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మొత్తం సంభాషణలో ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ తదితరులు ఉన్నారు. వారెవ్వరూ ఎస్వీ మాటలను ఖండించలేదు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై టీడీపీ దాని మిత్ర పక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. వైసీపీ నేతలకు ఆది నుంచీ మహిళలంటే చులకనేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.