Anantapur: వైసీపీ నాయకుడి రాసలీలలు
ABN , Publish Date - Dec 03 , 2025 | 05:55 AM
అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకుడు పట్నం ఫణీంద్ర ఓ వివాహితతో రాసలీల జరుపుతూ తీసుకున్న వీడియోను తానే పొరపాటున...
పొరపాటున తానే మీడియా వాట్సాప్ గ్రూప్‌లో పోస్టింగ్
నార్పల, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకుడు పట్నం ఫణీంద్ర ఓ వివాహితతో రాసలీల జరుపుతూ తీసుకున్న వీడియోను తానే పొరపాటున ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా గ్రూపులో పోస్టు చేశాడు. అరగంటపాటు ఆ విషయాన్ని గమనించకపోవడంతో వీడియో సోషల్ మీడియాకు ఎక్కి వైరల్ అవుతోంది. మహిళతో ఏకాంతంగా గడిపిన సమయంలో ఫణీంద్ర స్వయంగా వీడియోను రికార్డు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఫణీంద్ర.. జగన్ దినపత్రికలో సుమారు ఆరేళ్లపాటు నార్పల మండల విలేకరిగా పనిచేశాడు. మూడు నెలల క్రితం మానేసి, పూర్తిస్థాయిలో వైసీపీలో చేరాడు. పార్టీ బీసీ సెల్ శింగనమల నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నాడు. వీడియో వైరల్ కావడంతో ఫణీంద్రను వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సాకే శైలజనాథ్, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి పిలిపించుకుని తీవ్రస్థాయిలో మందలించినట్లు సమాచారం. అయితే ఆ వీడియో తనది కాదని, మార్ఫింగ్ చేసి తనపై దుష్పచారం చేస్తున్నారని ఫణీంద్ర వివరణ ఇచ్చాడు. ఈ విషయం గురించి తమకు ఫిర్యాదు అందలేని నార్పల ఎస్‌ఐ సాగర్ తెలిపారు.