Kakanni Govardhan Reddy: కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించండి
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:47 AM
తనపై నమోదైన కేసుల విచారణను సీబీఐ దర్యాప్తునకు అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....
హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత కాకాణి
అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): తనపై నమోదైన కేసుల విచారణను సీబీఐ దర్యాప్తునకు అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్వార్డ్జ్ అక్రమ మైనింగ్, కృష్ణపట్నం పోర్టులో అక్రమాలు, కల్తీ మద్యం పంపిణీ, మద్యం తరలింపు, సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు తదితర ఫిర్యాదులపై నెల్లూరు జిల్లా ముత్తుకూరు, వి. సత్రం, పొదలకూరు, ఇందుకూరుపేట ఎస్‌ఈబీ పోలీసులు కేసులు నమోదు చేశారని, అదేవిధంగా సీఐడీ కూడా 9 కేసులు నమోదు చేసినట్టు పిటిషన్‌లో వివరించారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్ జనరల్, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సీఐడీ అదనపు డీజీలతో పాటు ఫిర్యాదుదారులకు న్యాయమూర్తి జస్టిస్ జగడం సుమతి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.