Share News

Jogi Ramesh: నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించండి

ABN , Publish Date - Nov 02 , 2025 | 05:48 AM

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ నేత, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేశ్‌...

Jogi Ramesh: నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించండి

  • రాజకీయంగా నా ప్రతిష్ఠ దిగజారుస్తున్నారు

  • హైకోర్టులో వైసీపీ నేత జోగి రమేశ్‌ పిటిషన్‌

అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ నేత, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నకిలీ మద్యం తయారీ, సరఫరాకు సంబంధించి అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు, విజయవాడ భవానీపురం పోలీసుస్టేషన్‌లలో నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. ఆ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావు పోలీస్‌ కస్టడీలో ఉండగా వీడియో వాంగ్మూలం రికార్డు చేసి మీడియాకు విడుదల చేసిన వ్యవహారంపై అక్టోబరు 15న తాను ఫిర్యాదు చేశానని తెలిపారు. అయితే.. ఈ ఫిర్యాదుపై విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కేసు నమోదు చేయలేదని, దీనిని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోర్టును అభ్యర్థించారు.

Updated Date - Nov 02 , 2025 | 05:49 AM