వైసీపీకి తెలిసింది విమర్శలు, వీరంగమే: నీలాయపాలెం
ABN , Publish Date - Jul 29 , 2025 | 06:05 AM
జగన్ పాలనలో కొత్త కంపెనీలను తీసుకురాకపోగా.. ఉన్న కంపెనీలను తరిమికొట్టారు. నేడు వివిధ పాలసీలతో రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తుంటే వైసీపీ నేతలకు కడుపు మండుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘జగన్ పాలనలో కొత్త కంపెనీలను తీసుకురాకపోగా.. ఉన్న కంపెనీలను తరిమికొట్టారు. నేడు వివిధ పాలసీలతో రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తుంటే వైసీపీ నేతలకు కడుపు మండుతోంది’ అని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ నేతలకు విమర్శలు, వీరంగం తప్ప ఏదీ చేతకాదు. అభివృద్ధి అనేది వారి నిఘంటువులోనే లేదు. జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రం వెనుకబడిపోయింది. కూటమి ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళుతోంది’ అని నీలాయపాలెం అన్నారు.