Minister Nimmala Ramanaidu: వైసీపీ హయాంలో అభివృద్ధి సున్నా
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:23 AM
వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
అన్ని వ్యవస్థల విధ్వంసం.. ఇరిగేషన్ నిర్వీర్యం
గాడిలో పెడుతున్న కూటమి ప్రభుత్వం: మంత్రి నిమ్మల
నరసాపురం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అభివృద్ధి గుండు సున్నా అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పీఎంలంక వద్ద రూ.12.50 కోట్లతో నల్లిక్రీక్ తవ్వకం పనులకు ఎమ్మెల్యే నాయకర్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఉప్పుటేరులోకి వెళ్లి నల్లిక్రీక్ పాయను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. డ్రెయినేజీలు, కాల్వల పూడికతీత పనులు చేపట్టకపోవడం వల్ల రైతులు సాగుకు దూరమయ్యారని చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే వీటిన్నంటిని గాడిలో పెడుతోందన్నారు. ఇటు శ్రీశైలం డ్యామ్ వద్ద ధ్వంసమైన పం్లజ్‌పూల్, సైడ్ వాల్ నిర్మాణానికి రూ.200 కోట్లు, ధవళేశ్వరం బ్యారేజ్ ఆధునికీకరణ పనులకు రూ.150 కోట్లు, తుంగభద్ర గేటు మరమ్మతులకు రూ.54 కోట్లు కేటాయించామని తెలిపారు. రానున్న రోజుల్లో పెండింగ్ పనులకు దశల వారీగా నిధులు కేటాయించి పూర్తి చేస్తామని చెప్పారు.