Share News

Lidcap Chairman Pilli Manikya Rao: బీసీల ప్రగతిని వైసీపీ ఓర్వలేకపోతోంది

ABN , Publish Date - Sep 30 , 2025 | 06:38 AM

బీసీల ప్రగతి చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని లిడ్‌క్యాప్‌ చైర్మన్‌ పిల్లి మాణిక్యరావు విమర్శించారు.

Lidcap Chairman Pilli Manikya Rao: బీసీల ప్రగతిని వైసీపీ ఓర్వలేకపోతోంది

  • అధికారం పోయినా మార్పు రాలేదు: పిల్లి మాణిక్యరావు

అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): బీసీల ప్రగతి చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని లిడ్‌క్యాప్‌ చైర్మన్‌ పిల్లి మాణిక్యరావు విమర్శించారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పు డు బడుగు, బలహీన వర్గాలపై దాడులు, హత్యలు చేసి వారి జీవనాధారాన్ని ధ్వంసం చేశారని, ఇప్పటికీ వారిలో మార్పు రాలేదన్నారు. టీడీపీ కార్యకర్త చంద్రయ్యను పట్టపగలు వైసీపీ నరహంతకులు కిరాతకంగా హత్య చేశారని, అలాంటి చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే మండలిలో బొత్స సత్యనారాయణ అడ్డుకోవడం మానవత్వం లేని చర్య అని మండిపడ్డారు.

Updated Date - Sep 30 , 2025 | 06:38 AM