పూర్తయిన ఇళ్లకూ బిల్లులివ్వని వైసీపీ: పార్థసారథి
ABN , Publish Date - Sep 24 , 2025 | 05:42 AM
ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకూ గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపివేసిందని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకూ గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపివేసిందని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. 2014-19 మధ్య కాలంలోని బకాయిలు మొత్తం రూ.900 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందన్నారు. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు బత్తుల రామకృష్ణ, బి.రామాంజనేయులు, బుచ్చయ్యచౌదరి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణంలో జరిగిన భారీ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పీఎంఏవై 2.0 పథకం కింద 46 వేల ఇళ్లు మంజూరు చేసిందన్నారు.