Convoy Controversy: సీఎం కాన్వాయ్‌లో అంబులెన్స్‌లపై వైసీపీ రంగులు
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:02 AM
సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో వైసీపీ మాజీ ఎంపీ బి.సత్యవతి ఫొటో, ఆ పార్టీ జెండా రంగులున్న అంబులెన్స్‌లను వినియోగించడం చర్చనీయాంశమైంది.
ఆ పార్టీ మాజీ ఎంపీ సత్యవతి ఫొటో కూడా...
అనకాపల్లి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో వైసీపీ మాజీ ఎంపీ బి.సత్యవతి ఫొటో, ఆ పార్టీ జెండా రంగులున్న అంబులెన్స్‌లను వినియోగించడం చర్చనీయాంశమైంది. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ నుంచి బంగారయ్యపేటలో సభా ప్రాంగణం వరకు సీఎం కాన్వాయ్‌లో ఇలాంటివి రెండు అంబులెన్స్‌లు కనిపించాయి. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి హైమావతిని వివరణ కోరగా, గతంలో ఎంపీ నిధులతో అంబులెన్స్‌లు కొనుగోలు చేసినందున ఫొటోలు మార్చలేదని చెప్పారు. అనకాపల్లిలో రెండు, తాళ్లపాలెంలో రెండు అంబులెన్స్‌లు వినియోగించాల్సి రావడంతో, గత ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన వాటిని వినియోగించామని తెలిపారు.