వైసీపీ ఫేక్ ఫార్టీ: బుచ్చి రాంప్రసాద్
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:15 AM
వైసీపీ ఓ ఫేక్ పార్టీ అని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు.
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఓ ఫేక్ పార్టీ అని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఆధ్యాత్మికతకు ప్రతీకలైన హిందూ దేవాలయాలపై వైసీపీ ముఠా విషప్రచారం చేస్తోంది. తిరుమల వెంకటేశ్వరునికి సతీసమేతంగా జగన్ ఒక్కసారైనా పట్టువస్త్రాలు సమర్పించాడా? నిత్యం హిందూమతంపై దాడి చేయటం వైసీపీ పేటీఎం బ్యాచ్‌కి అలవాటుగా మారింది’ అంటూ బుచ్చి రాంప్రసాద్ మండిపడ్డారు.