Agriculture Minister Acchenna: వైసీపీ ఓ ఫేక్ పార్టీ
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:47 AM
వైసీపీ ఒక ఫేక్ పార్టీ. ఆ పార్టీ నాయకులు మెడికల్ కాలేజీల విషయంలో కొత్త నాటకాలాడుతున్నారు అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు...
వాజపేయి బాటలోనే దేశాభివృద్ధి.. విగ్రహావిష్కరణ సభలో అచ్చెన్న
శ్రీకాకుళం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ఒక ఫేక్ పార్టీ. ఆ పార్టీ నాయకులు మెడికల్ కాలేజీల విషయంలో కొత్త నాటకాలాడుతున్నారు’ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో శుక్రవారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడారు. ‘గతంలో 108 వాహనాలను పీపీపీ విధానంలో అరబిందో సంస్థకు కట్టబెట్టి రూ.వేల కోట్లు దోచుకున్న చరిత్ర వైసీపీది. వైసీపీ ఎంపీలే పీపీపీ విధానం బాగుందని ఢిల్లీలో కేంద్రానికి లేఖలు రాసి ఇక్కడ మొసలి కన్నీరు కారుస్తున్నారు. వాజపేయి విధానాలే దేశాభివృద్ధికి పునాది వేశాయి. వాజపేయి స్ఫూర్తితోనే నేడు మోదీ సుపరిపాలన అందిస్తున్నారు’ అని అచ్చెన్న అన్నారు. కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యేలు కూన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.