Neelayapalem Vijayakumar: కాగ్ అంకెలకూ వైసీపీ వక్రభాష్యం: విజయ్
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:00 AM
కాగ్ నివేదికలోని అంకెలనూ వైసీపీ తిమ్మినిబమ్మిని చేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ విమర్శించారు.
అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): కాగ్ నివేదికలోని అంకెలనూ వైసీపీ తిమ్మినిబమ్మిని చేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ విమర్శించారు. ‘మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ఏడాది ఆదాయాన్ని రెండేళ్ల క్రితం అంకెలతో పోల్చి కూటమి ప్రభుత్వం విఫలం అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2023, జూలైలో వైసీపీ హయాంలో రూ.58 వేల కోట్లు ఆదాయం వచ్చింది. 2023 జూలైలో కేంద్ర నుంచి వచ్చిన రూ.20 వేల కోట్ల గ్రాంట్లను కూడా కలిపి చెప్పిన బుగ్గన... అదే 2025 జూలైలో కేంద్రం నుంచి ఎలాంటి గ్రాంట్లు లేకుండానే రాష్ట్రం సొంత ఆదాయం రూ.49 వేల కోట్లు అనే విషయాన్ని చెప్పడం లేదు. కేంద్రం గ్రాంట్స్‌ను మినహాయిస్తే 2023 జూలైలో వచ్చిన ఆదాయం కేవలం రూ.38 వేల కోట్లు మాత్రమే’ అని నీలాయపాలెం వివరించారు.