Share News

Farmer Issues: రైతు సమస్యలపై నేడు సీఎంకు షర్మిల వినతిపత్రం

ABN , Publish Date - Sep 26 , 2025 | 05:09 AM

రైతు సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి వినతిపత్రం అందజేస్తానని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు...

 Farmer Issues: రైతు సమస్యలపై నేడు సీఎంకు షర్మిల వినతిపత్రం

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రైతు సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి వినతిపత్రం అందజేస్తానని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటనను ఆమె విడుదల చేశారు. శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ‘రైతన్నకు అండగా కాంగ్రెస్‌’ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అన్నదాతల ఆక్రందనలపై కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి కాంగ్రెస్‌ నేతలతో చర్చించాక .. సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళతామని తెలిపారు.

Updated Date - Sep 26 , 2025 | 05:10 AM