Share News

12న నంద్యాలకు వైఎస్‌ షర్మిల రాక

ABN , Publish Date - Jun 05 , 2025 | 11:29 PM

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈ నెల 12వ తేదీన నంద్యాలకు వస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్‌ తెలిపారు.

   12న నంద్యాలకు వైఎస్‌ షర్మిల రాక
సమావేశంలో మాట్లాడుతున్న డీసిసి అధ్యక్షులు లక్ష్మీనరసింహాయాదవ్‌

నాయకులు, కార్యకర్తలు పర్యటను విజయవంతం చేయాలి

డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్‌

నంద్యాల రూరల్‌ , జూన 5 (ఆంధ్రజ్యోతి): పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈ నెల 12వ తేదీన నంద్యాలకు వస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్‌ తెలిపారు. గురువారం నంద్యాల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్‌ చాకలి పుల్లయ్య అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని సూరజ్‌ గ్రాండ్‌ హోటల్‌లో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో షర్మిల సమావేశం నిర్వహిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి వైఎస్‌ షర్మిల జిల్లా పర్యటనకు వస్తున్నట్లు తెఇపారు. నాయకులు, కార్యకర్తలు, అన్నివర్గాల ప్రజలు పర్యటనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చింతలయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి రియాజ్‌, ఆర్గనైజర్‌ రజాక్‌వలి తదితరులు పాల్గొన్నారు.

డీసీసీ ఉపాధ్యక్షుడిగా పఠాన సలీం

డీసీసీ ఉపాధ్యక్షుడిగా పఠాన సలీంను ఎన్నుకున్నట్లు డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్‌ తెలిపారు. పట్టణ అధ్యక్షుడిగా ఉన్న సలీంను డీసీసీ ఉపాధ్యక్షుడిగా, దాసరి చింతలయ్యను పట్టణ అధ్యక్షుడిగా నియమించామన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 11:29 PM