YS Sharmila: రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:49 AM
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జేడీ శీలం...
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో షర్మిల సమావేశం
అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జేడీ శీలం, మస్తాన్‌వలికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూచించారు. వారిద్దరితో ఆమె విజయవాడలో సమావేశమయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంత పార్టీ బాధ్యతలను జేడీ శీలం, దక్షిణాంధ్ర పార్టీ బాధ్యతలను మస్తాన్‌వలికి అప్పగించారు.