Share News

సాగుకు కూటమి చేసింది పంచ మోసాలు: షర్మిల

ABN , Publish Date - Nov 26 , 2025 | 06:09 AM

సాగుకు పంచ సూత్రాలు కాదు... కూటమి ప్రభుత్వం చేసింది పంచ మోసాలు అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాగుకు కూటమి చేసింది పంచ మోసాలు: షర్మిల

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘సాగుకు పంచ సూత్రాలు కాదు... కూటమి ప్రభుత్వం చేసింది పంచ మోసాలు’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఈమేరకు ఆమె ఓ ప్రకటన చేశారు. ‘చంద్రబాబు పంచ సూత్ర సంక్షేమం పచ్చి బూటకం. 17 నెలలుగా వ్యవసాయాన్ని గాలికి వదిలేశారు. సాగుకు సమాధి కట్టి... అన్నదాతల మేలు కోసం పంచసూత్ర ప్రణాళిక అనేందుకు, రైతన్నా మీ కోసం అని వెళ్లేందుకు, విస్తృత ప్రచారం అని డబ్బా కొట్టేందుకు కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగిన నష్టాన్ని చెల్లించకుండా చంద్రబాబు ఎగ్గొట్టారు. పంటలకు మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు. అన్నదాత సుఖీభవ కింద సగం మంది రైతులకు పంగనామాలు పెట్టారు. అరటి, టమాటా, ఉల్లి పంటల ధరలు రూపాయికి పడిపోయినా ధరల స్థిరీకరణ నిధి పెట్టలేదు. చివరికి రైతులకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలను కూడా అందించకుండా ఇబ్బందులకు గురిచేశారు’ అని షర్మిల విమర్శించారు.

Updated Date - Nov 26 , 2025 | 06:10 AM