YS Jagan: పంటల ధరలు పతనమైనా రైతులవైపు చూడరేం
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:34 AM
పంటల ధరలు దారుణంగా పతనమైనా రైతుల వైపు కన్నెత్తయినా చూడలేదెందుకని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి...
సీఎం చంద్రబాబును ఉద్దేశించి జగన్ పోస్ట్
అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పంటల ధరలు దారుణంగా పతనమైనా రైతుల వైపు కన్నెత్తయినా చూడలేదెందుకని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదివారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఆసరా లేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్ని వేసే పరిస్థితులు మీరు తీసుకువచ్చారు. ఇలా మీ దుర్మార్గ పాలనతో రైతుల ఒంటిమీద ఉన్నచొక్కాను కూడా తీసివేసి వారిని రోడ్డు మీద నిలబెట్టారు. పబ్లిసిటీ కోసం రైతన్నా మీకోసం అంటూ ప్రకటలను ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ మోసాలను ప్రశ్నిస్తూ, మీ నిర్లక్ష్యాన్ని కడిగేస్తూ, మీ కాలర్ పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మరచిపోవద్దు’ అని జగన్ ట్వీట్ చేశారు.