Share News

YS Jagan: మళ్లీ అధికారంలోకి వస్తాం

ABN , Publish Date - Nov 26 , 2025 | 06:47 AM

వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, మంచి రోజులు వస్తాయని, ఎవరూ అధైర్యపడొద్దని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు.

YS Jagan: మళ్లీ అధికారంలోకి వస్తాం

మంచి రోజులొస్తాయ్‌.. అధైర్యపడొద్దు.. వైసీపీ కార్యకర్తలతో జగన్‌

బెంగళూరు నుంచి పులివెందులకు రాక

పులివెందుల, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, మంచి రోజులు వస్తాయని, ఎవరూ అధైర్యపడొద్దని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం జగన్‌ బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందులకు వచ్చారు. భాకరాపురంలోని హెలిప్యాడ్‌ నుంచి రోడ్డుమార్గాన క్యాంప్‌ కార్యాలయానికి చేరుకున్నారు. 4 గంటల నుంచి 7.10 గంటల వరకు ప్రజాదర్బార్‌ చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, ప్రజలు ఆయనను కలిసేందుకు వచ్చారు. జగన్‌ను కలిసేందుకు క్యాంప్‌ కార్యాలయం వద్దకు చేరుకున్న కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కార్యాలయంలోకి ఒక్కోసారి కొందరికి మాత్రమే అనుమతి ఇస్తుండడంతో డోరు వద్ద తోపులాట జరిగింది. ఈ తోపులాటలో డోరు పక్కనే ఉన్న కిటికీ అద్దం పగిలింది. జగన్‌ గత పర్యటనలో కూడా తోపులాటలో కార్యాలయం కిటికీ అద్దాలు పగిలాయి. తాజా పర్యటనలో కిటికీ అద్దం పగిలిన విషయాన్ని గమనించిన సీఐ సీతారామిరెడ్డి ఇందుకు కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కలుగజేసుకుని వీళ్లంతా తమ కార్యకర్తలే అని, వదిలేయాలని సూచించారు. అనంతరం డీఎస్పీ మురళీనాయక్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయానికి వచ్చారు. సీఐలు సీతారామిరెడ్డి, నరసింహులు, రమణలతో కలిసి డోరు వద్ద గుంపుగా ఉన్న వారందరినీ అక్కడి నుంచి బయటికి పంపించేశారు.

Updated Date - Nov 26 , 2025 | 06:47 AM