Share News

YSR Remembrance: వేర్వేరుగానే వైఎస్‌కు నివాళులు

ABN , Publish Date - Sep 03 , 2025 | 06:25 AM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకుని అన్నాచెల్లెలు జగన్‌, షర్మిలలు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వేర్వేరుగానే నివాళులర్పించారు.

YSR Remembrance: వేర్వేరుగానే వైఎస్‌కు నివాళులు

  • జగన్‌ వెళ్లిపోయే వరకు వేచి ఉన్న షర్మిల

  • ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు.. పాల్గొన్న విజయలక్ష్మి

వేంపల్లె, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకుని అన్నాచెల్లెలు జగన్‌, షర్మిలలు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వేర్వేరుగానే నివాళులర్పించారు. వీరిద్దరి కార్యక్రమాల్లో తల్లి విజయలక్ష్మి పాల్గొన్నారు. పులివెందుల నుంచి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి భారతి, తల్లి విజయలక్ష్మి, ఎంపీ అవినాశ్‌రెడ్డి, బాబాయి సుధీకర్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్సార్‌ ఘాట్‌కు వచ్చి రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు చేరుకోవాల్సిన జగన్‌ అరగంట ఆలస్యంగా వచ్చారు. అనంతరం, వైఎస్‌ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా, జగన్‌ ఘాట్‌ నుంచి వెళ్లే వరకు వైఎస్‌ షర్మిల గెస్ట్‌హౌ్‌సలో వేచి ఉన్నారు. వెళ్లిపోయాక 9 గంటల సమయంలో ఆమె అక్కడకు చేరుకున్నారు. తల్లి విజయలక్ష్మి, కుమారుడు రాజారెడ్డి, కోడలు ప్రియ, కుమార్తె అంజలి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్‌ స్ఫూర్తితో ప్రజల కోసమే పనిచేస్తున్నానని షర్మిల తెలిపారు.

Updated Date - Sep 03 , 2025 | 06:28 AM