Prakasam District: ఆన్‌లైన్ గేమ్స్‌కు యువకుడు బలి
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:56 AM
ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులన్నీ పోగొట్టుకుని, అప్పులపాలై, ఆ అప్పులు తీర్చలేక, ఒత్తిడికి గురై యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నారుట్లలో...
అప్పులు పెరిగిపోవడంతో నల్లమలలో ఉరి.. మృతుడు హైదరాబాద్ వాసి
పెద్దదోర్నాల, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులన్నీ పోగొట్టుకుని, అప్పులపాలై, ఆ అప్పులు తీర్చలేక, ఒత్తిడికి గురై యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నారుట్లలో మంగళవారం ఈ ఘటన వెలుగుచూసింది. చిన్నారుట్ల వద్ద నల్లమల అడవిలో చెట్టుకు ఉరి వేసుకొని యువకుడు మృతి చెందిన విషయమై వచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి... పరిశీలించగా శ్రీశైలం-దోర్నాల ఘాట్ రోడ్డుపై బైక్ ఉంది. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో నాలుగైదురోజుల కిందట ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పరిసరాల్లో దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడారు. మృతుడిని హైదరాబాద్ బండ్లగూడకు చెందిన ముక్కెర సాయికుమార్(27)గా గుర్తించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులు హైదరాబాద్ తీసుకెళ్లినట్లు ఎస్‌ఐ తెలిపారు.