యువత మత్తుకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:01 AM
యువత మత్తుకు దూరంగా ఉండాలని రెడ్‌క్రాస్ చైర్మన దస్తగిరి అన్నారు.
నంద్యాల హాస్పిటల్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : యువత మత్తుకు దూరంగా ఉండాలని రెడ్‌క్రాస్ చైర్మన దస్తగిరి అన్నారు. జిల్లాలో ఈగల్‌టీం, ఇండియన రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈగల్‌టీం ఉమ్మడిజిల్లా ఎస్సై సృజనకుమార్‌తో కలిసి మంగళవారం రామకృష్ణ డిగ్రీ కాలేజి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి, గురురాజ ఇంగ్లీ్‌షమీడియం పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకంతో శారీరక, మానసిక రుగ్మతలు తలెత్తుతాయన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండడంతో ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుం దన్నారు. రామకృష్ణ డిగ్రీ కాలేజిలో ప్రిన్సిపాల్ సుబ్బయ్య అధ్యక్షతన ఐఎంఏ నంద్యాల అధ్యక్షుడు డా.శ్రీనివాసరావు, డా.అరుణకుమారి, రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ సభ్యుడు ఉస్మానబాషలు హాజరై ప్రసంగించారు. పాలిటెక్నిక్ కాలేజిలో ప్రిన్సిపాల్ శైలేంద్ర అధ్యక్షతన జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన అధికారి శంకర్‌నాయక్, రోటరీ ఇన్నర్‌వీల్ చైర్మన మల్లీశ్వరి, రెడ్‌క్రాస్ సభ్యురాలు వసుంధరాదేవి హాజరై అవగాన కల్పించారు. కార్యక్రమంలో సుబ్బారావు, మాసుంవలి, ప్రసాద్, మనోహర్ పాల్గొన్నారు.