Share News

శక్తి యాప్‌ను డౌనలోడు చేసుకోవాలి

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:54 PM

ప్రతి మహిళ శక్తి యాప్‌ను డౌనలోడు చేసుకోవాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ తెలిపారు.

   శక్తి యాప్‌ను డౌనలోడు చేసుకోవాలి

జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్‌

కర్నూలు క్రైం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రతి మహిళ శక్తి యాప్‌ను డౌనలోడు చేసుకోవాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళల భద్రత కోసం శక్తి యాప్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 14,137 మంది మహిళలు శక్తి యాప్‌ను తమ మొబైల్స్‌లో డోనలోడ్‌ చేసుకుని రిజిసే్ట్రషన చేసుకున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్‌స్టేషనకు వెళ్లాల్సిన అవసరం లేకుండా శక్తి యాప్‌ ద్వారా డయల్‌ 112 ఎనవోఎస్‌ బటన ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. మహిళలకు పోలీసులు అత్యవసర సహాయం అందించేందుకు శక్తి యాప్‌ పని చేస్తుందన్నారు. శక్తి యాప్‌ 799348511ను మహిళలు కాల్‌ చేసినా మెసేజ్‌ చేసినా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు సంకేతాలు వెళ్లిన వెంటనే శక్తి టీం స్పందిస్తారన్నారు. జిల్లాలో శక్తి టీమ్‌లను ప్రత్యేంగా ఏర్పాటు చేనశామని, శక్తి టీమ్‌లు జిల్లాలో జిల్లా హెడ్‌ క్వార్టర్‌ టీమ్‌తో సహా కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్‌ డివిజన్లలో మొత్తం 5 శక్తి టీమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కో టీమ్‌లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులతో కలిసి మొత్తం ఆరు మంది పోలీసులు ఉంటారన్నారు. ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడే వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక హాట్‌ స్పాట్‌లను గుర్తించి ఆక్కడ ఈ టీములు పని చేస్తుంటాయనీ తెలిపారు. పాఠశాలలో, ఇంటర్‌ కాలేజీలో చదివే విద్యార్థులకు ఈవ్‌ టీజింగ్‌, బాల్య వివాహాలు, ప్రేమ మోసాలు, సోషల్‌ మీడియా ప్రభావం, సైబర్‌ క్రైం, విద్యా ప్రాధాన్యత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

Updated Date - Aug 12 , 2025 | 11:54 PM