Share News

లాఠీలతో ఉద్యమాన్ని ఆపలేరు

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:59 PM

తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని శాంతియుత ఆందోళనకు దిగిన మున్సిపల్‌ కార్మికులపై లాఠీ చార్జీ చేయడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, నందికొట్కూరు పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ, మున్సిపల్‌ వర్కర్స్‌ అసోసియేషన అధ్యక్షుడు నాగన్న అన్నారు.

లాఠీలతో ఉద్యమాన్ని ఆపలేరు
నందికొట్కూరు మున్సిపల్‌ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న నాయకులు

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం

నందికొట్కూరు/ ఆత్మకూరు రూరల్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని శాంతియుత ఆందోళనకు దిగిన మున్సిపల్‌ కార్మికులపై లాఠీ చార్జీ చేయడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, నందికొట్కూరు పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ, మున్సిపల్‌ వర్కర్స్‌ అసోసియేషన అధ్యక్షుడు నాగన్న అన్నారు. శుక్రవారం నెల్లూరులో మున్సిపల్‌ కార్మికులపై జరిగిన లాఠీ చార్జీని నిరసిస్తూ నందికొ ట్కూరు, ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయాల వద్ద సీఐటీయూ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ము న్సిపల్‌ వర్కర్స్‌ యూనియన నాయకులు పరమేష్‌ అధ్యక్షత వహించా రు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, 14 రోజుల సమ్మె కాలానికి జీతాలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన కార్మికులు గత 45 రోజులుగా శాంతియుతంగా కార్పొరేషన కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న కార్మికులపై లాఠీ చార్జీ చేయడం సిగ్గుచేటన్నారు. లాఠీల వల్ల కార్మికుల ఉద్యమన్నా కూటమి ప్రభుత్వం ఆపలేదన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపతామని ఆయన హెచ్చరించారు.

Updated Date - Dec 19 , 2025 | 11:59 PM