ఉచిత న్యాయసేవలు పొందొచ్చు
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:11 AM
ఉచిత న్యాయ సేవలను, లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రి సూచించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి లీలావెంకటశేషాద్రి
నందికొట్కూరు సబ్‌జైలు తనిఖీ
నందికొట్కూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఉచిత న్యాయ సేవలను, లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రి సూచించారు. సోమవారం నందికొట్కూరు సబ్‌జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయాధికారి లీలావెంకటశేషాద్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జైలులోని పరిసరాలను పరిశీలించారు. భోజన వసతులు, వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుఉకున్నారు. 70 సంవత్సరాల పైబడిన వారు ఉన్నారా అని ఆరాతీశారు.ఈ సందర్భంగా ఆయన సబ్‌జైలులోని ముద్దాయిలకు న్యాయసేవల గురించి వివరించారు. న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారి స్థానిక మండల న్యాయసేవా కేంద్ర వద్ద గానీ, హెల్ప్‌లైన నెంబరు 15100 ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో జైలు అధికారి రఘునాథరెడ్డి, న్యాయవాది మద్దయ్య, వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.