యోగా జీవితంలో భాగం కావాలి
ABN , Publish Date - May 21 , 2025 | 11:18 PM
యోగా అందరి జీవితాల్లో ఒక భాగం కావాలని కలెక్టర్ పి. రంజిత బాషా పేర్కొన్నారు.
వీటితో కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు
కలెక్టర్ పి. రంజిత బాషా
యోగాతో అన్నింట్లో చురుకుదనం : మేయర్ బీవై రామయ్య
మే 21 నుంచి జూన 21వరకు యోగాంధ్ర క్యాంపెయిన : జేసీ నవ్య
యోగాసనాలు వేయించిన యోగా శిక్షకులు
ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర కర్టెనరైజర్ ప్రారంభం
యోగా ఉత్సవాల భారీ బెలూన ఎగురవేత
కర్నూలు కల్చరల్, మే 21 (ఆంధ్రజ్యోతి): యోగా అందరి జీవితాల్లో ఒక భాగం కావాలని కలెక్టర్ పి. రంజిత బాషా పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర క్యాంపెయినకు శ్రీకారం చుడుతూ కర్టెన రైజర్ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో నగర ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు (యోగా గురువులు) వివిధ రకాల ఆసనాలు వేయించారు. కలెక్టర్ రంజిత బాషా, ఎస్పీ విక్రాంత పాటిల్, జేసీ డాక్టర్ బి. నవ్య, ఇతర అధికారులు యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ యోగాతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై ఈరోజు నుంచి నెలరోజుల పాటు విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. నెల రోజుల పాటు వివిధ కార్యక్ర మాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ ఆరోగ్య భారతావని ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి యోగా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషదాయకమన్నారు. యోగాతో ఆరోగ్యంతో పాటు చదువులో, ఆటల్లో అన్నింటిలో చురుకుగా ఉంటారన్నారు. జేసీ డాక్టర్ బి. నవ్య మాట్లాడుతూ మే 21 నుంచి జూన 21 వరకు నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాలను ప్రకటించారని, ఈ నెలంతా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు యోగాంధ్ర క్యాంపెయిన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. యోగా కార్యక్రమాల్లో పాల్గొనే వారు యప్‌లో రిజిసే్ట్రషన చేయించుకోవాలని తెలిపారు. యోగా వల్ల మానసిన ఆరోగ్యం సాధ్యమవుతుందని, ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుందని జేసీ పేర్కొన్నారు. యోగా ఆసనాలకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించి పంపిణీ చేశారు. యోగాంధ్ర క్యాంపెయినలో భాగంగా నగరంలోని టౌన మోడల్ హైస్కూల్‌లో యోగా ఉత్సవాలకు సంబంధించిన భారీ బెలూనను కలెక్టర్, ఎస్పీ, జేసీ ఎగురవేశారు. కార్యక్రమంలో ఎస్పీ విక్రాంత పాటిల్, నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, డీఆర్వో వెంకట నారాయణమ్మ, ఆర్డీవో సందీప్‌కుమార్, డీఎంహెచవో శాంతికళ, ఆయూష్ శాఖ వైద్యులు డాక్టర్ ప్రసాద్, యోగా అసోసియేషన రాష్ట్ర కార్యదర్శి అవినాష్, యోగా శిక్షకులు మునిస్వామి, విజయకుమార్, డాక్టర్ ముంతాజ్‌బేగం, గౌరి, జిల్లా అధికారులు, అభ్యాసకులు, విద్యార్థులు పాల్గొన్నారు.