Nakka Anand Babu: జైలునే వైసీపీ కేంద్ర కార్యాలయం చేసుకోండి
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:11 AM
మద్యం కుంభకోణంలో అరెస్టైన మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తుండటం సిగ్గుచేటని ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు...
జెండా ఎగరేయలేరు కానీ జైలు యాత్రలు చేస్తారు: నక్కా
మద్యం కుంభకోణంలో అరెస్టైన మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తుండటం సిగ్గుచేటని ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి, అక్రమ మద్యం, హత్య, కిడ్నాప్ కేసుల్లో అరెస్టై, జైలులో ఉన్న వారిని పరామర్శించేందుకు జగన్ జైలు యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో రాజమండ్రి సెంట్రల్ జైలునే వైసీపీ కేంద్ర కార్యాలయంగా చేసుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు జాతీయజెండా ఎగురవేయలేని జగన్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వేసుకుని జైలు యాత్రలు మాత్రం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.