Share News

Minister Sandhyarani: వైసీపీ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగం

ABN , Publish Date - Jul 20 , 2025 | 05:52 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. ప్రజలు తిరస్కరించి అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు.

Minister Sandhyarani: వైసీపీ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగం

  • ప్రజలు తిరస్కరించి అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని తెచ్చారు: మంత్రి గుమ్మడి

కొయ్యలగూడెం, జూలై 19(ఆంధ్రజ్యోతి): ‘గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. ప్రజలు తిరస్కరించి అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఐదేళ్లు రాష్ట్రం అన్నింటా వెనుకబడింది’ అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో శనివారం ఆమె పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ‘టీడీపీ ప్రభుత్వం వచ్చాక రూ.1,300 కోట్లతో రోడ్లు నిర్మించాం. గిరిజన ప్రాంతాలను డోలి లేని ప్రాంతాలుగా చేయాలనే లక్ష్యంతో మరో రూ.1,000 కోట్లతో రోడ్లు నిర్మిస్తాం. రూ.146 కోట్లతో గిరిజన సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నాం’ అని పేర్కొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 05:52 AM