Social Media Activist: పోలీసుల అదుపులో వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్
ABN , Publish Date - Aug 24 , 2025 | 05:14 AM
దివ్యాంగుడు అయిన తనకు పింఛన్ తొలగించారని కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త...
దివ్యాంగుల పింఛన్ ఫేక్ వీడియోపై కేసు
పుట్టపర్తి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): దివ్యాంగుడు అయిన తనకు పింఛన్ తొలగించారని కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పి.రమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు నమోదైంది. బుక్కపట్నం మండలం నార్సింపలికి చెందిన రమేశ్.. ఒక చేతిని చొక్కాలో దాచుకుని సెల్ఫీ వీడియోను పోస్టు చేశాడు. అతడికి రెండు చేతులు ఉన్న విషయం వెల్లడి కావడంతో పరారయ్యాడు. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని బుక్కపట్నం ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు.