Share News

Perni Nani: నాపై పెట్టిన కేసు కొట్టివేయండి

ABN , Publish Date - Jul 15 , 2025 | 06:02 AM

వైసీపీ కార్యకర్తల భేటీల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని) రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మచిలీపట్నం...

Perni Nani: నాపై పెట్టిన కేసు కొట్టివేయండి

  • హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత పేర్ని నాని

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ కార్యకర్తల భేటీల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని) రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మచిలీపట్నం టీడీపీ పట్టణ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కృష్ణా జిల్లా పామర్రు పోలీసులు తన నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ పేర్ని వెంకటరామయ్య సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో... ‘నా వ్యాఖ్యల్లో కొంత భాగాన్ని మాత్రమే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలిస్తే తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాప్తి చేసినట్లు ఎలాంటి ఆరోపణలు లేవు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు నాకు వర్తించవు. ఆధారాలు లేని ఆరోపణలతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసును కొనసాగించడం న్యాయ విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని కేసును కొట్టివేయండి. అరెస్టుతో పాటు కేసు ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి’ అని కోరారు.

Updated Date - Jul 15 , 2025 | 06:03 AM