Share News

Jagan Unpaid Bills: లక్షల కోట్లు పంచామంటూ.. 31,500 కట్టలేకపోయారు

ABN , Publish Date - Jul 05 , 2025 | 03:45 AM

వైసీపీ హయాంలో న్యాయ శాఖ లైబ్రరీకి అవసరమైన జర్నల్స్‌, బుక్స్‌ రెండు వేర్వేరు చోట్ల నుంచి తీసుకున్నారు. వీటి బిల్లులు రూ.31,500, రూ.93,510 అయ్యాయి.

Jagan Unpaid Bills: లక్షల కోట్లు పంచామంటూ.. 31,500 కట్టలేకపోయారు

  • జగన్‌ జమానాలో ఆర్థిక దౌర్భాగ్యం

  • న్యాయ శాఖ లైబ్రరీకి జర్నల్స్‌, బుక్స్‌ కొనుగోలు చేసిన బిల్లులు పెండింగ్‌

  • మరో బిల్లు 93,510 కూడా.. ఇలాంటి పెండింగ్‌ కేసులు వేలల్లోనే

రూ.31,500 బిల్లు.. రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చిన్నది. దాదాపు రూ.3 లక్షల కోట్లు బడ్జెట్‌ ఉన్న ప్రభుత్వానికి ఈ బిల్లు చెల్లించడం చిటికెలో పని. కానీ ‘బటన్‌’ నొక్కి రూ.2 లక్షల కోట్లు పేదలకు పంచామని గొప్పలు చెప్పుకొన్న గత జగన్‌ సర్కారు ఈ బిల్లును కూడా చెల్లించలేకపోయింది. అంతేకాదు ఎంతో మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా అన్యాయం చేసింది. తక్కువలో తక్కువగా వేల రూపాయల్లో చెల్లించాల్సిన వేలాది బిల్లులను పెండింగ్‌లో పెట్టింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో న్యాయ శాఖ లైబ్రరీకి అవసరమైన జర్నల్స్‌, బుక్స్‌ రెండు వేర్వేరు చోట్ల నుంచి తీసుకున్నారు. వీటి బిల్లులు రూ.31,500, రూ.93,510 అయ్యాయి. ఈ బిల్లులు చెల్లించాలని 2024 జనవరి 12వ తేదీన న్యాయ శాఖ రెండు జీవోలు ఇచ్చింది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లులను చెల్లించలేదు సరికదా.. 2024 మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున వాటిని తదుపరి ఆర్థిక సంవత్సరానికి తీసుకురాకుండా రద్దు చేసేసింది. అన్ని అనుమతులూ పొంది, సీఎ్‌ఫఎంఎస్‌ వ్యవస్థలోకి చ్చిన ఇలాంటి వేలాది బిల్లులను రద్దు చేసింది. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లింపులకు అర్హత సాధించాలంటే మళ్లీ ఆ శాఖతో పాటు ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోవాలి. పరిశీలనలు పూర్తయ్యాక దాన్ని చెల్లింపుల వ్యవస్థలోకి తీసుకురావాలి. ఈ లోపు ఆర్థిక సంవత్సరం పూర్తవుతుంది. కథ మళ్లీ మొదటికొస్తుంది. ఇలా జగన్‌ హయాంలో ఐదేళ్ల పాటు అలా రద్దవుతూ, వ్యవస్థలోకి ఎక్కుతూ ఉన్న బిల్లులు లెక్కలేనన్ని ఉన్నాయి. రూ.10,000 లోపు ఉన్న బిల్లులు కూడా అనేకం పెండింగ్‌లో పెట్టింది. చిన్న చిన్న కాంట్రాక్టర్లు సీఎంవో చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా కరుణించలేదు. బిల్లుల బాధితుల నుంచి తప్పించుకునేందుకు అప్పటి ఆర్థిక శాఖ అధికారులైతే ఏకంగా పోలీసులనే కాపలాగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 9వ తేదీన ఆర్థిక శాఖ ఇచ్చిన మెమో ప్రకారం ఇలా ఆర్థిక సంవత్సరాంతంలో రద్దయిన బిల్లులకు మళ్లీ ఆర్థిక శాఖతో పాటు సంబంధిత అన్ని శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.


నాడు అంతా అడ్డగోలు

జగన్‌ హయాంలో రాష్ట్రంలో ఉన్న ఆస్తులు, ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, పార్కులు, భూములు తాకట్టు పెట్టారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని పాతికేళ్ల పాటు తాకట్టు పెట్టి మరీ అప్పులు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్లను సృష్టించి వాటి ద్వారా లక్షల కోట్ల అప్పులు చేశారు. అయినా కాంట్రాక్లర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆర్థిక శాఖపై ఇచ్చిన శ్వేతపత్రంలో గత ప్రభుత్వంలోని పెండింగ్‌ బిల్లులు రూ.13,5,000 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. ఇంకా తేలాల్సిన బిల్లులు ఉన్నాయని చెప్పారు. నాడు ఆర్థిక వ్యవస్థను జగన్‌ అస్తవ్యస్తంగా నిర్వహించారు. గత ఐదేళ్ల పాలనలో ఆర్థిక శాఖను అప్పులు తెచ్చే శాఖగా మాత్రమే చూశారు. ఏనాడూ కూడా పెండింగ్‌ బిల్లులు, వాటి చెల్లింపులపై సమీక్ష చేయలేదు. అస్మదీయుల బిల్లుల చెల్లింపులు మాత్రమే ఆగకుండా జరిగాయి. బిల్లుల బాధితులు లక్షల సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు. బిల్లులు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పినా లెక్కచేయలేదు. దీంతో ఐఏఎ్‌సలు స్వయంగా కోర్టుకు హాజరై శిక్షలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి.

21 వేల కోట్లు చెల్లించిన ‘కూటమి’

చంద్రబాబు సీఎం అయ్యాక జగన్‌ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లుల్లో దాదాపు రూ.21,000 కోట్లు చెల్లించారు. కేంద్ర పథకాల కోసం మ్యాచింగ్‌ గ్రాంటుగా రూ.8,000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 70 పథకాలను తిరిగి గాడిలో పెట్టారు. జగన్‌ తన ఐదేళ్ల పాలనలో కేంద్రం పథకాల కోసం ఇచ్చిన డబ్బును, అందుకు మ్యాచింగ్‌గా రాష్ట్రం ఖర్చు చేయాల్సిన సొమ్మును కూడా దారి మళ్లించారు.

Updated Date - Jul 05 , 2025 | 10:23 AM