YCP Fake Campaign: ప్రధాని పర్యటనపైనా వైసీపీ ఫేక్ ప్రచారం
ABN , Publish Date - Oct 17 , 2025 | 06:23 AM
ప్రధాని పర్యటనను సైతం వైసీపీ తన ఫేక్ ప్రచారానికి వాడుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా తాము ఆయనకు...
దీనిపై కేంద్ర నిఘా వర్గాల ఆరా..?
ప్రధాని పర్యటనను సైతం వైసీపీ తన ఫేక్ ప్రచారానికి వాడుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా తాము ఆయనకు పలు అంశాలపై వినతిపత్రాలు ఇచ్చినట్లు వాటిపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు వైసీపీ నాయకులు తమ సోషల్ మీడియా యాక్టివిస్టుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఎటువంటి వినతి పత్రం ఇవ్వకుండానే వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని వైసీపీ తరఫున వినతి పత్రం ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వైసీపీ ఏనాడూ ప్రధాని పర్యటనకు ప్రొటోకాల్ ప్రకారం ప్రతిపక్ష పార్టీని ఆహ్వానించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ప్రకారం వైసీపీ ప్రజాప్రతినిధులను సైతం ఆహ్వానిస్తుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని కూడా వైసీపీ ప్రజా ప్రతినిధులు నిలబెట్టుకోవటం లేదు. ప్రధాని కార్యక్రమాన్ని సైతం వైసీపీ తమ ఫేక్ ప్రచారాలకు వాడుకోవడంపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీసినట్లు సమాచారం.