Share News

SIT Petition: చెవిరెడ్డి వ్యవహారంలో సిట్‌ పిటిషన్‌పై 17కు విచారణ వాయిదా

ABN , Publish Date - Dec 13 , 2025 | 06:03 AM

మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని కోర్టు కు తీసుకొచ్చినపుడు కుటుంబ సభ్యులు తప్ప...

SIT Petition: చెవిరెడ్డి వ్యవహారంలో సిట్‌ పిటిషన్‌పై 17కు విచారణ వాయిదా

  • చాణక్య బెయిల్‌పై 15న వాదనలు

విజయవాడ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని కోర్టుకు తీసుకొచ్చినపుడు కుటుంబ సభ్యులు తప్ప ఇతరులెవరూ కలవకుండా ఆదేశాలు ఇవ్వాలని సిట్‌ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ 17కి వాయిదా పడింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని చెవిరెడ్డి తరఫు న్యాయవాదులను విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించిం ది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న చెవిరెడ్డి రిమాండ్‌ పొడిగింపునకు ఎస్కార్ట్‌ సిబ్బంది కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో ఆయన నానా హంగామా చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు పలుమార్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక నుంచి ఎలాంటి హడావుడి ఉండదని చెవిరెడ్డి కోర్టుకు లిఖితపూర్వకంగా అఫిడవిట్‌ ఇచ్చారు. అయినా ఆయన మీడి యా కనిపించగానే మాట్లాడుతున్నారు.

చాణక్య పిటిషన్‌పై 15న వాదనలు

మద్యం కుంభకోణంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బూనేటి చాణక్య బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను ఏసీబీ కోర్టు ఈ నెల 15కి వాయిదా వేసింది. బెయిల్‌ మంజూరు చేయాలని చాణక్య కొద్దిరోజుల క్రితం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై ప్రాసిక్యూషన్‌ శుక్రవారం కౌంటర్‌ దాఖలు చేసింది. ఇదే కేసులో గుంటూరు జైల్లో ఉన్న రోణక్‌ కుమార్‌ దాఖలు చేసిన ఇంటి నుంచి భోజనం పిటిషన్‌పై 15న రిప్లై కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయవాదులను కోర్టు ఆదేశించారు.

వంశీ పిటిషన్‌ 17కు వాయిదా

ముదునూరి సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో వారం రోజుల సీసీ ఫుటేజీ ఇవ్వాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ 17కి వాయిదా పడింది. దీనిపై ప్రాసిక్యూషన్‌ ఇప్పటికే కౌంటర్‌ దాఖలు చేసింది.

Updated Date - Dec 13 , 2025 | 06:05 AM