Share News

బాబు హయాంలోనే స్కాం: సజ్జల

ABN , Publish Date - Jul 21 , 2025 | 05:09 AM

లిక్కర్‌ స్కాంలో ఎలాంటి ఆధారాలు లేకపోయినా అక్రమంగా అందరినీ అరెస్టు చేస్తున్నారని, అరెస్టయిన వారి...

బాబు హయాంలోనే స్కాం: సజ్జల

ఇంటర్నెట్ డెస్క్: లిక్కర్‌ స్కాంలో ఎలాంటి ఆధారాలు లేకపోయినా అక్రమంగా అందరినీ అరెస్టు చేస్తున్నారని, అరెస్టయిన వారి ఉసురు చంద్రబాబుకు తగులుతుందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు హాయాంలోనే మద్యం కుంభకోణం జరిగిందని, ఏడాదికి రూ.1,300 కోట్ల ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేసి, 40 వేలకుపైగా బెల్టు షాపులు పెట్టారని, నాలుగైదు డిస్టలరీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఆ స్కాంలో అరెస్ట్‌ అయిన చంద్రబాబు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని చెప్పారు. విజయవాడలో కోర్టుల ప్రాంగణం వద్ద ఆదివారం ఆయన మాట్లాడారు. ఈసారి కూటమి ప్రభుత్వం బరితెగించి తప్పుడు కేసు సృష్టించిందన్నారు. మద్యం కేసులో ఎలాంటి అధారాలు లేవన్నారు. ఇది చంద్రబాబు సృష్టించిన కట్టు కథ అని, న్యాయస్థానంలో నిలబడదని పేర్కొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 05:10 AM