Srisathyasai District: దళితులపై వైసీపీ దాష్టీకం.. ఎస్సీ కాలనీకి అడ్డుగా ముళ్లకంప
ABN , Publish Date - Jul 14 , 2025 | 05:16 AM
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని సుబ్బరావుపేట గ్రామంలో పీర్లపండుగలోకి దళితులు రాకూడదంటూ వైసీపీ వర్గీయులు రెచ్చిపోయారు.
ధర్మవరం రూరల్, జూలై 13(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని సుబ్బరావుపేట గ్రామంలో పీర్లపండుగలోకి దళితులు రాకూడదంటూ వైసీపీ వర్గీయులు రెచ్చిపోయారు. ఆ కాలనీకి వెళ్లే దారికి అడ్డంగా ముళ్లకంపలు వేశారు. పీర్లపండుగలో భాగంగా గ్రామంలో శనివారం రాత్రి పెద్దసరిగెత్తు జరిగింది. అక్కడ డప్పు కొట్టేందుకు ఎస్సీ కాలనీ నుంచి పెద్దగంగప్ప, చిన్నగంగప్ప, వెంకటేశ్, నారాయణస్వామి వెళ్లారు. ఆ సమయంలో వైసీపీ వర్గీయులైన బాలు, కోన.. చిన్నగంగప్పను ఆటోతో ఢీకొట్టడమే కాకుండా వారిపై బూతులతో రెచ్చిపోయారు. దీంతో డప్పు కొడుతున్న దళితులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం వైసీపీ వర్గీయులు పీర్లపండగలోకి దళితులు రాకూడదంటూ ఎస్సీ కాలనీకి దారికి అడ్డుగా ముళ్లకంప వేశారు.