వైసీపీది అప్రజాస్వామిక ప్రవర్తన: యనమల
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:41 AM
జగన్, అతని ఎమ్మెల్యేలది అప్రజాస్వామిక ప్రవర్తన అని, అది వారందరినీ అనర్హతకు గురిచేసే ప్రమాదముందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు...
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): జగన్, అతని ఎమ్మెల్యేలది అప్రజాస్వామిక ప్రవర్తన అని, అది వారందరినీ అనర్హతకు గురిచేసే ప్రమాదముందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలందరిపైనా అనర్హత కత్తి వేలాడుతోందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం అనర్హత నుంచి తప్పించుకోవడానికి వైసీపీ వారికి రెండే మార్గాలు ఉన్నాయని తెలిపారు. ఒకటి.. ఎమ్మెల్యేలు తమ గైర్హాజరీని సెలవుగా పరిగణించాలని కోరవచ్చని, దాన్ని పాలకపక్షం ఆమోదించాల్సి ఉంటుందని, రెండోది సభకు హాజరుకావడమని పేర్కొన్నారు. ఈ రెండింటిలో ఏది జరగకపోయినా వారిపై వేటు ఖాయమని యనమల తెలిపారు.