ఉద్యోగులకు డీఏ ఇవ్వడమూ జగన్‌కు ఇష్టం లేదు: యనమల
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:52 AM
దీపావళి బహుమతిగా ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వడం జగన్‌కు ఇష్టం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు.
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): దీపావళి బహుమతిగా ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వడం జగన్‌కు ఇష్టం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్, అతని అనుచరులు.. వైసీపీ ఐదేళ్ల పాలనలో 4 డీఏలు ఎందుకు ఇవ్వలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘పీఆర్సీని ఎందుకు ప్రకటించలేకపోయారు. ఐఆర్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు’ అని ప్రశ్నించారు. జగన్‌కు ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలంటే పెద్దగా పట్టింపు లేదన్నారు. ఉద్యోగుల సమస్యలపై వారితో ఏనాడైనా జగన్ చర్చలు జరిపారా? అని యనమల నిలదీశారు.