Share News

జగన్‌ హయాంలో ఆర్థిక విధ్వంసం: యనమల

ABN , Publish Date - Dec 05 , 2025 | 04:12 AM

ఆర్థిక క్రమశిక్షణకు ఉద్దేశించిన ఎఫ్‌ఆర్‌ఎంబీ(ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) నిబంధనలను జగన్‌ తన పాలనలో ఎప్పుడూ పాటించలేదని...

జగన్‌ హయాంలో ఆర్థిక విధ్వంసం: యనమల

అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఆర్థిక క్రమశిక్షణకు ఉద్దేశించిన ఎఫ్‌ఆర్‌ఎంబీ(ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) నిబంధనలను జగన్‌ తన పాలనలో ఎప్పుడూ పాటించలేదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో బడ్జెట్‌ రుణాలు 6.5 లక్షల కోట్లకు చేరాయని, ఇది జీఎస్డీపీలో 35 శాతమని తెలిపారు. ఆ రుణాలను ఎక్కడ ఖర్చు చేశారో కూడా లెక్కలు లేవన్నారు. కాగా.. జగన్‌ మైనార్టీల ద్రోహి అని, 2014-19 మధ్య కాలంలో మైనార్టీలకు చెందిన 11 సంక్షేమ పథకాలను జగన్‌ అధికారంలోకి రాగానే రద్దు చేశారని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ విమర్శించారు. జగన్‌ హయాంలో వేలాది ఎకరాల వక్ఫ్‌ భూములను కబ్జా చేశారని, 12 మైనార్టీ గురుకులాలకు ఒక్క రూపాయీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు.

Updated Date - Dec 05 , 2025 | 04:14 AM