Share News

Yanamala Strategist: యనమల రాజకీయ వ్యూహకర్త

ABN , Publish Date - Apr 11 , 2025 | 06:03 AM

తమ పార్టీకి చక్కటి మార్గదర్శకుడిగా యనమల రామకృష్ణుడు తన రాజకీయ అనుభవంతో వ్యూహాలను రూపొందిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్ర కీలకంగా నిలుస్తోంది

Yanamala Strategist: యనమల రాజకీయ వ్యూహకర్త

  • ఎన్టీఆర్‌కు ముద్దుబిడ్డ: స్పీకర్‌ అయ్యన్న

  • తునిలో యనమల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ

కాకినాడ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ‘టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అద్భుతమైన రాజకీయ వ్యూహకర్త. ఈ రోజుల్లో ఒకసారి గెలిస్తేనే మళ్లీ ఎమ్మెల్యేగా గెలవలేని పరిస్థితులున్నాయి. అలాంటిది 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అరుదైన రికార్డు. ఎన్టీఆర్‌కు ముద్దుబిడ్డగా యనమల ఎంతో దగ్గరయ్యారు. అటువంటి నేత సేవలు పార్టీకి ఎంతో అవసరం’ అని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. కాకినాడ జిల్లా తునిలో గురువారం యనమల 42 ఏళ్ల రాజకీయ ప్రస్థాన సభ గురువారం జరిగింది. ముఖ్యఅతిఽథిగా హాజరైన అయ్యన్న.. మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి యనమల రాజకీయ ప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు సభ వద్ద ఫొటోగ్యాలరీని ప్రారంభించారు. మంత్రులు అనిత, నారాయణ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. యనమల ప్రసంగిస్తూ.. రాజకీయాల్లో మంత్రి పదవి ప్రధానం కాదని, మనం వేసిన ముద్రే ప్రధానమని చెప్పారు.

Updated Date - Apr 11 , 2025 | 06:03 AM