Share News

Yadav Leaders: యాదవులకు జగన్‌ క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Dec 07 , 2025 | 05:21 AM

మాజీ సీఎం జగన్‌పై ఏలూరు జిల్లా యాదవ, బీసీ సంఘాల నాయకులు భగ్గుమన్నారు.

Yadav Leaders: యాదవులకు జగన్‌ క్షమాపణ చెప్పాలి

  • ఏలూరులో మాజీ సీఎం ఫ్లెక్సీ దహనం

ఏలూరు రూరల్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌పై ఏలూరు జిల్లా యాదవ, బీసీ సంఘాల నాయకులు భగ్గుమన్నారు. మాజీ ఐఏఎస్‌, బీసీ కులానికి చెందిన కృష్ణయ్య యాదవ్‌, ఐపీఎస్‌ అధికారి గోపీనాథ్‌ జెట్టిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్‌ యాదవులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఏలూరులోని ఫైర్‌స్టేషన్‌ సెంటర్లో యాదవ యువ సమితి జిల్లా అధ్యక్షుడు కాట్రు బాలకృష్ణ ఆధ్వర్యంలో జగన్‌ ఫొటో ఉన్న ఫ్లెక్సీని దహనం చేసి నిరసన తెలిపారు. గోపీనాథ్‌ జెట్టి, కృష్ణయ్యలను వాడు.. వీడు అంటూ సంబోధించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ద్వారకాతిరుమలలో జరిగిన యాదవుల సమావే శంలో సంఘం నేతలు మాట్లాడుతూ జగన్‌ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 07 , 2025 | 05:21 AM