కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:20 AM
మున్సిపాలిటీలో పని చేస్తున్న ఇంజనీరింగ్ సెక్షన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు అన్వర్‌బాషా, అబ్బాస్ డిమాండ్ చేశారు.
· కమిషనర్‌కు వినతి పత్రం అందజేత
డోన టౌన, జూన 13 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీలో పని చేస్తున్న ఇంజనీరింగ్ సెక్షన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు అన్వర్‌బాషా, అబ్బాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ సెక్షన కార్మి కుల జీతాలు పెంచాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన అధ్యక్షులు హరి, గౌస్, అజయ్, చంద్ర, సంజీవుడు, భాస్కర్ పాల్గొన్నారు.