పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:59 PM
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.
నందికొట్కూరు రూరల్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. సోమవారం నందికొట్కూరు మండలంలోని బొల్లవరం గ్రామంలో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలను గుర్తించి టీడీపీ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ ఇనచార్జి మాండ్ర శివానందరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రశంసాపత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణకొట్కూరు సొసైటీ సింగిల్‌విండో చైర్మన మద్దూరు హరిసర్వోత్తమరెడ్డి, నాయకులు మాండ్ర సురేంద్రనాథరెడ్డి, కాతా రమే్‌షరెడ్డి, వెంకటేశ్వర్ల యాదవ్, సత్యం రెడ్డి, ప్రసాదరెడ్డి, రమే్‌షరెడ్డి పాల్గొన్నారు.
వేంకటేశ్వరస్వామికి పూజలు
మండలంలోని బొళ్లవరం వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ ఇనచార్జి మాండ్ర శివానందరెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించి ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్త తులసిరెడ్డి, ప్రధానార్చకులు, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.