పట్టణాభివృద్ధే ధ్యేయంగా పని చేయండి
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:14 AM
రాజకీయాలకు అతీతంగా పట్టణాభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సూచించారు.
వార్డుల్లో పనులను నిలిపివేస్తే
డీఈలు బాధ్యత వహించాలి
త్వరలో డివైడర్లు,
సెంటర్ లైటింగ్ ఏర్పాటు
నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య
నందికొట్కూరు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలకు అతీతంగా పట్టణాభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సూచించారు. మంగళవారం పట్టణంలోని జైకిసాన పార్కులో మున్సిపల్ చైర్మన దాసి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గిత్తా జయసూర్య హాజరై మాట్లాడుతూ వార్డుల్లో జరుగుతున్న పనులను మధ్యలోనే నిలిపివేస్తే సంబంధిత డీఈ, ఏఈలు బాధ్యులవుతారన్నారు. పట్టణ ప్రధాన రహదారికి డివైడర్లు, సెంటర్ లైటింగ్ పనులకు రూ. 3 కోట్లు మంజూరు అయ్యాయని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. నందికొట్కూరు నుంచి నంద్యాల వెళ్లే రహదారిని నిర్మించాలని చైర్మన దాసి సుధాకర్‌రెడ్డి కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ గార్గేయపురం నుంచి మిడ్తూరు వరకు, నందికొట్కూరు నుంచి మిడ్తూరు వరకు, నందికొట్కూరు నుంచి పగిడ్యాల వరకు బీటీ రోడ్డు అనుమతులు మంజూరు అయ్యాయన్నారు. రేపటి ప్రధాన మంత్రి పర్యటనను నాయకులు, అధికారులు సమన్వయంతో జయప్రదం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. జంతు వదశాలను మార్చాలని పదేపదే అడుగుతున్నా స్థలాన్ని టౌన ప్లానింగ్ అధికారులు చూపిండం లేదని సభ దృష్టికి 2వ వార్డు కౌన్సిలర్ జాకీర్ తీసుకొచ్చారు. పట్టణంలో కుక్కల అధికంగా ఉన్నాయని, చిన్నపిల్లలు, మహిళలు కుక్కకాటు బారిన పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే స్పందిస్తూ వదశాల సమస్య మూడు రోజుల్లో పరిష్కారం కావాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బేబి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అన్న క్యాంటీన ఆకలి తీర్చే అక్షయపాత్ర
ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికీ అన్న క్యాంటీన అక్షయపాత్రగా నిలిచిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మంగళవారం పట్టణంలోని అన్న క్యాంటీనను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. భో జనం చేస్తున్న వారితో ఎమ్మెల్యే మాట్లాడి వివరా లు తెలుసుకున్నారు. క్యాంటీనలో అందించే ఆహారం నాణ్యతగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్ బేబి, వైస్ ఛైర్మన రబ్బాని, కౌన్సిలర్లు భాస్కర్‌రెడ్డి, జాకీర్ హుసేన, ధర్మారెడ్డి, సొసైటీ చైర్మన ముర్తుజావళి, నాయకులు రజినీ కాంతరెడ్డి, వడ్డె శ్రీనువాసులు, రాజు, మోహన, సురేంద్ర, శ్రీను పాల్గొన్నారు.