Share News

మహిళల శ్రేయస్సు టీడీపీతోనే సాధ్యం

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:04 AM

మహిళల శ్రేయస్సు, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు.

మహిళల శ్రేయస్సు టీడీపీతోనే సాధ్యం
మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మను సన్మానిస్తున్న కాలనీవాసులు

మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ

పట్టణంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’

డోన టౌన, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మహిళల శ్రేయస్సు, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 2వ వార్డు ఇనచార్జి ఎనవీ సరోజ, 3వ వార్డు ఇనచార్జి తోట మనోహర్‌ ఆధ్వర్యంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. వార్డుల్లో ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌గౌడ్‌ను సూచించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో ఏడాది పాలనలో ఎన్నెన్నో పథకాలు, అభివృద్ధి అందించిన ఘనత కూటమికే సాధ్యమన్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులకు అమలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్రికే ఫణిరాజ్‌, నాయకులు ఓబులాపురం శేషిరెడ్డి, టీఈ శేషన్నగౌడు, పెద్దకేశవయ్యగౌడు, శేషఫణిగౌడు, డోన సహకార సంఘం చైర్మన ఎల్లగౌడు, సుదీష్‌, ము న్సిపల్‌ వైస్‌ చైర్మన కోట్రికే హరికిషన, కమలాపురం సర్పంచ రేగటి అర్జునరెడ్డి, టీఈ రాఘవేంద్రగౌడు, చనుగొండ్ల శ్రీరాములు, మున్సిప ల్‌ డీఈ రఘు, ఏఈ సురేష్‌, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 12:04 AM